Janasena Varahi Vehicle : సంచలనాలకు చిరునామా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్. మొదటి సినిమాతోనే తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభతో ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్నారు. చేతులపై కార్లు ఎక్కించుకోడం.. గుండెలపై బండ రాళ్ళని పగల కొట్టించుకోవడం లాంటి స్టంట్స్ అప్పట్లో సంచలనం కలిగించాయి. ఆ తర్వాత ఆయన నటించిన సుస్వాగతం, తొలిప్రేమ, బద్రి, ఖుషి సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచి రికార్డ్స్ లో కొత్త ట్రెండ్ సెట్ చేశాయి.
తర్వాతి కాలంలో పవన్ ఏ సినిమా చేసినా అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇప్పటికీ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థని స్థాపించి దానికి విరాళంగా తన ఖాతాలో ఉన్న 1.5 కోటి నుంచి కోటి రూపాయలు ఇవ్వడం దేశ వ్యాప్తంగా చర్చల్లో నిలిచింది.
ఇక తన అన్నయ్య ప్రజారాజ్యం స్థాపించిన పిదప యువరాజ్యం అధ్యక్షునిగా పవన్ ప్రసంగాలు.. కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీసి తరిమి కొట్టాలంటూ అప్పటి యుపిఎ ప్రభుత్వం మీద పవన్ చేసిన ఘాటు విమర్శలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంటాయ్.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన కొన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. పార్టీ ప్రకటించిన రోజున నోవాటెల్ హోటల్లో ఆయన చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం పెను సంచలనం రేపింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్యం వహించడం. తెలుగు దేశం ప్రభుత్వంలో జరిగే తప్పులను వేలెత్తి చూపుతూ..ప్రత్యేక హోదా అంశంలో బిజెపిని వ్యతిరేకిస్తూ ఆ కూటమి నుంచి బయటికి వచ్చి 2019 లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లతో కలిసి పోటీ చేయడం మరల 2019 ఎన్నికల అనంతరం తిరిగి బిజెపితో పొత్తు పెట్టుకోవడం ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ప్రతి మలుపు సంచలనాలకు కేంద్ర బిందువుగానే నిలిచింది.
వైసిపి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ పై ఇటీవల కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దీనికి దేశ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం లభించింది.
Also Read : జగన్ సర్కార్ కు పొత్తు భయం.
తాజాగా పవన్ తన రాజకీయ ప్రచార వాహనం “వారాహి” నీ పరిచయం చేసిన రోజు నుంచి ఆ వాహనానికి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేయడం పెద్ద చర్చకే దారి తీసింది. పవన్ అంటే కళల్లో నిప్పులు పోసుకునే పేర్ని నాని లాంటి వారు వారాహి రంగు మీద చేసిన రచ్చ ఎవరూ మర్చిపోలేరు. ఇంతచేసి హైదరాబాద్లో వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో జరిగిపోయిందన్న విషయాన్ని జన సేన శ్రేణులు ఆలస్యంగా వెలుగులోకి తీసుకు రావడంతో అప్పటిదాకా వీరంగం ఆడిన ప్రభుత్వ పెద్దలు ఖంగు తిన్నారు. గుడివాడ అమర్నాథ్ దిద్దుబాటు చర్యలు భాగంగా తెలంగాణ RTO చట్టం.. AP RTO చట్టం అంటూ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడి అభాసుపాలయ్యారు.
ఏదేమైనా దేశంలో ఏ వాహనానికి రానంత ప్రచారం రావడం. దేనిమీద జరగనంత చర్చ వారాహిపై జరగడం ఒక ఎత్తైతే. ఏకంగా ప్రభుత్వంలోని మంత్రులే రంగంలోకి దిగి కోట్లు ఖర్చు పెట్టినా రానంత పబ్లిసిటీ ఇవ్వడం మరో పెద్ద విషయం. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ఎం చేసిన సంచనలమే అని మరోసారి నిరూపితమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ రోజు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి జనసేన శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ కొండ గట్టుకి పయనమయ్యారు.
అనంతరం 32 నృసింహ క్షేత్రాలను జనసేనాని సందర్శిస్తారు అని పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం.
– ప్రద్యుమ్న