Pawan Kalyan : మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు చిత్రపరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు యంగ్ హీరోస్. ఇక వీరంతా నెట్టింట చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
పవన్, చిరుతో కలిసి ఉన్న అప్పటి జ్ఞాపకాలను పంచుకుంటుంటారు. అలాగే మెగా ఫ్యామిలీ అరుదైన పిక్స్ చూసేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో పవన్, చిరు, నాగబాబు కలిసున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి.
Also Read: మెగాస్టార్ సినిమా లో సాయి పల్లవి?
మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు.. పవన్ కళ్యాణ్ మధ్యలో సరదాగా కూర్చున్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ హీరో. కటౌట్లో తిరుగే లేదు. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా ?. ఆ చిన్నోడు మరెవరో కాదండి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్.
ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్.. కంచె చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే మెగా ఇంట పెళ్లి బజాలు మోగబోతున్నాయి. అతి త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ప్రకటన రాబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగబాబు.