Dreams: నిద్రలో కలలు రావడమనేది సర్వసాధారణం. అయితే, కలలు కొన్ని మంచివి, మరికొన్ని చెడువి ఉంటాయి. మీకు ఎప్పుడైనా కల వస్తే.. ఉదయం నిద్రలేవగానే మళ్లీ మళ్లీ అదే కలను గుర్తుకు తెచ్చుకుంటూ దాని అర్థం కోసం ఆరాతీస్తుంటారు. అయితే, రాత్రి వచ్చే కలలు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు సూచనలు, సంకేతాలంటున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మతపరమైన గ్రంథాలు: కలలో ఏదైనా మతపరమైన గ్రంధాలు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతం. ఈ పుస్తకం ఏదైనా మతానికి సంబంధించినది కావచ్చు.. ఇంకా మీరు సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం. ఏదైనా ప్రాథమిక ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం కావచ్చు అని పేర్కొంటున్నారు.
Also Read: ప్రతిపక్ష నాయకుని స్థాయి దాటలేకపోతున్న జగన్
బైక్ రైడ్ (ద్విచక్ర వాహనంపై ప్రయాణం) : మీ కలలో సైకిల్ తొక్కుతూ మీరు ఎక్కడికైనా వెళుతుంటే అది కూడా శుభానికి చిహ్నం. అంటే మీ శ్రమ బలంతో మీరు జీవిత లక్ష్యం వైపు పయనిస్తున్నారని అర్థం. మీరు సరైన దిశలో వెళుతున్నారని విశ్వసించవచ్చు. కానీ, ఎప్పటికప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది కావున.. దాని కోసం మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి.
బిస్కెట్లు: కలలో ఏదైనా బిస్కెట్ని చూసినట్లయితే అది మీకు శుభం. అది ఫలవంతమైన కల అని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి కల త్వరలో ఏదైనా బహుమతిని పొందే అవకాశం ఉందని సూచన.. బిస్కెట్ అనేది జీవితంలో మధురమైన అనుభవానికి చిహ్నం.
పువ్వులు: కలలో పువ్వును చూడటం శుభానికి చిహ్నం. పువ్వు ఆనందం, సంతృప్తి, యవ్వనానికి చిహ్నం. అయితే ఈ ఆనందం తాత్కాలికమే.
గోర్లు కొరకడం లేదా కత్తిరించడం: గోర్లు కత్తిరించినా, లేదా కొరుతున్నట్లు వచ్చే కల కూడా మంచిదేనట.. ఇలా చేయడం ద్వారా మీ రుణం త్వరగా తగ్గుతుంది లేదా పూర్తి అవుతుందని అర్ధం అని స్వప్న శాస్త్రం పేర్కొంటోంది.
Discussion about this post