Pawan Kalyan Unstoppable : సాధారణంగా సినిమాలపై అంచనాలుండటం సహజమే. కానీ.. తొలిసారి ఓ టాక్‌షోలోని ఎపిసోడ్‌కు ఈ రేంజ్ హైప్ రావటం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అందుకు కారణం.. పవన్ కళ్యాణ్ తొలిసారి పాల్గొన్న టాక్ షో ఇది. అలాగే.. హోస్ట్ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై కనిపించటం కూడా ఇదే తొలిసారి. ఇద్దరు సినిమాలతో పాటు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. దీంతో ఇటు ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూశాయి.
అందరూ ఎదురు చూసినట్లే అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకేలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వచ్చేసింది. రావటమే కాదండోయ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన 14 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది. తద్వారా ఆహాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసిన ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ‘పవన్ బ్లాక్ సొక్కా ఏసాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టరే’ అంటూ ఆహా యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసింది.
Also Read: ఇలా చేస్తే వారాహిని ఆపడం ఈజీనే..!!
అంతకుముందు బాలయ్య- పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ ఈవెంట్‌కు సుమారు 200 మంది అభిమానులు హాజరయ్యారు. ఇక విజయవాడలోనూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. బాలయ్య- పవన్ కల్యాణ్‌ల ఇంటర్వ్యూల సెకెండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తెలిపింది. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాల గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
#PawanKalyanOnAHA Black sokka esaadu ante bomma blockbuster eh😉
100 million streaming now✌🏻#UnstoppableWithNBKS2 Baap of all Episodes Streaming now. #NBKOnAHA #NandamuriBalakrishna @PawanKalyan #MansionHouse @tnldoublehorse @realmeIndia@Fun88India #ChandanaBrothers pic.twitter.com/rSkDQak2MX— ahavideoin (@ahavideoIN) February 3, 2023