Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీతో ఒక్కసారిగా మారిపోయింది. బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్. పుష్పరాజ్ తో బన్నీకి వరల్డ్ వైడ్ గా కూడా ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన అభిమానుల ఆర్మీ అంటూ ముద్దుగా పిలుస్తుంటాడు. పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో దీనికి సీక్వెల్ గా పుష్ప: ది రూల్ (పుష్ప 2) ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఆ మధ్య హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప టీమ్, ఇటీవల వైజాగ్ అరకు వ్యాలీలో 18 రోజులపాటు బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంది. వైజాగ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం అభిమానులు కోసం చిత్రబృందం వైజాగ్ లో ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసింది. గాదిరాజ్ ప్యాలస్, రుషికొండలోని రాడిసన్ బ్లూలో అభిమానులతో ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. కాగా.. బన్నీని కలవడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగి ఆనంద పరిచాడు.
Also Read: అమిగోస్ రివ్యూ అండ్ రేటింగ్
ఈ క్రమంలోనే ఓ దివ్యాంగుడైన అభిమాని తనని కలిసేందుకు రాగా.. అతని ఎత్తుకొని మరి ఫోటో దిగి, ఆ అభిమాని దిల్ ఖుషి చేశాడు బన్నీ. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా నిన్న ఇదే ఈవెంట్ కి హాజరయిన కొంతమంది అభిమానులు మాత్రం నిరాశతో వెనక్కి వెళ్లారు. ఫ్యాన్స్ భారీగా తరలి రావడంతో అల్లు అర్జున్ అందర్నీ కలవడం కుదరలేదు.
This is sooo good to see from ICON STAR #AlluArjun❤️@alluarjun met his Fan Boy who's wishing him to meet since a couple of years, finally #AlluArjun fulfilled his Fan boy's dream today 🤩👏👏❤️ pic.twitter.com/EozaWv8Ich
— Thyview (@Thyview) February 7, 2023