Harihara Veeramallu: తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అవుతున్నాడు. దీంతో ఆయన మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులు అలస్యమవుతున్నాయి. ముఖ్యంగా క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్లో రాబోయే హరిహర వీరమల్లు షూటింగ్ కొవిడ్ సమయంలో మొదలైనా.. ఇంకా పూర్తవలేదు.
వాస్తవానికి వకీల్ సాబ్ తరువాత హరిహర వీరమల్లు సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ సినిమా తరువాత ప్రారంభించిన భీమ్లానాయక్ థియేటర్లోకి వచ్చి సందడి చేసింది. కానీ హరిహర వీరమల్లు మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. పీరియాడిక్ జోనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ విప్లవయోధుడిగా కనిపించనున్నాడు.
Also Read: పండుగ రోజు ప్రభాస్ ఫాన్స్ కి పండుగ లాంటి న్యూస్
ఇదిలా ఉండగా ఈ మూవీ అప్డేట్స్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ టీజర్ వదిలి, ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట మేకర్స్. అది కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సాంగ్ గా అని టాక్.
ఇదిలావుండగా కీరవాణి.. ఆస్కార్ నామినేషన్స్ వరకైతే వెళ్లారు. ఆస్కార్ అవార్డు అందుకోడానికి జెస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆయన అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు కాగా ఆయన మ్యూజిక్ లోని మ్యాజిక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శివరాత్రి సందర్భంగా విడుదలయ్యే ఫస్ట్ సాంగ్ తో కీరవాణి మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడాని అంతా భావిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ క్రిష్ శైలి కూడా భిన్నంగా ఉండడంతో ఆర్ఆర్ఆర్ లెవల్ లో సాంగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపధ్యంలో కీరవాణి నుంచి రాబోతున్న హరిహరవీరమల్లు ఫస్ట్ సాంగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి పవన్ కోసం కీరవాణి ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడో, ఎంత వరకు మెప్పిస్తుందో..