ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు రెట్టింపు చెయ్యడంతో రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం రేట్లతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
సంపూర్ణ మద్యనిషేదం చేసే దిశలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా మద్యం దుకాణాలని తగ్గించండం,
బెల్ట్ షాపుల తొలగింపు,మరియు పర్మిట్ రూమ్ ల రద్దును ప్రభుత్వం కఠినంగా అమలుచేస్తోంది
అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ మద్యాన్ని నిరోదించడంలో మరియు నాటు సారా విక్రయాలు పెరగడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీనిపై ఎక్సైజ్ శాఖ ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ఫలితాలు రావడం రాకపోవడంతో దీనిపై సమీక్ష నిర్వహించారు.
కొంతమంది వ్యక్తులు గుంటూరు జిల్లాలో శానిటైజర్ తాగి మృతి చెందిన సంఘటన పై కూడా ప్రభుత్వం విచారణ జరిపింది. చీప్ లిక్కర్ ధరని నలభై శాతం తగ్గించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మందుబాబులకి ఇక పండుగే అని ఛలోక్తులు వేసుకుంటున్నారు.