కేరళలోని మున్నార్ లో కొండచరియలు విరిగిపడి 15 మంది చనిపోయారు, ఇంకో 60 మంది ఆ కొండచరియలు మధ్య చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది ఇంకా వివరాలు తెలియాల్సిఉంది.
ముఖ్యమంత్రి పినరాయి ఈ ఘటనపై స్పందిస్తూ, “ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు, మరో 15 మందిని సహాయక బృందాలు ప్రాణాలకి తెగించి రక్షించాయి” అని అన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు పొంగి పొర్లుతుండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు కలుగుతున్నాయి. దాంతో కేరళ ప్రభుత్వం సహాయకచర్యలకి భారత వైమానికదళం సహాయాన్ని కోరింది.
