YS Jagan Progress Report : ప్రోగ్రెస్ రిపోర్టులో ఏముందో..?
• టికెట్లు దక్కేదెవరికి – హిట్ లిస్టులో ఉన్నదెవరు..?
• ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా వేగం పెంచిన జగన్
• కొత్త వ్యూహాలకు పదును
• ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రత్యేకంగా ఫోకస్
ముఖ్యమంత్రి ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రజలతో మమేకం అయ్యేలా ఎమ్మెల్యేల తో “గడప గడపకూ ప్రభుత్వం” నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు.. ఎమ్మెల్యేల పని తీరు ప్రాతిపదికగా సర్వే నివేదికలు అందుతున్నాయి. గెలిచే వారికే టికెట్లు అని ఇప్పటికే స్పష్టం చేసారు. పనితీరు మెరుగు పర్చుకోవాల్సిన వారికి హెచ్చరికలు చేసారు. ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు కు సంబంధించి ప్రోగ్రస్ రిపోర్టులను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం..
పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
పూర్తి అయిన నివేదికలు ఆధ్యయనం, కీలక సమాచార క్రోడికరణ మార్గదర్శకం చేయనున్న ఆధినేత :
సీఎం జగన్ ప్రతీ నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితులు.. ఎమ్మెల్యేల పని తీరు పైన పూర్తి స్థాయిలో సర్వే నివేదికలతో సిద్దమయ్యారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తానని ప్రకటించారు. టీడీపీ – జనసేన పొత్తు వేళ టికెట్ల కేటాయింపు అంశంలో సీఎం జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే…సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వారి పని తీరు మాత్రమే టికెట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుందని స్పష్టం చేసారు.
ఇప్పుడు తాజాగా సర్వే నివేదికల్లో ఆ 32 మంది ఎమ్మెల్యేల కు సంబంధించి ఏం తేల్చారనేది కీలకంగా మారుతోంది. వారిలో తాజా-మాజీ మంత్రులతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం. ఇక..పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటనలు చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
Also Read : యువగళం దాటాల్సిన మైలు రాళ్లు..
ఎమ్మెల్యేల ప్రోగ్రస్ కార్డులు సిద్దం:
ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి వారి ప్రోగ్రస్ కార్డులు ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం సిద్దం చేస్తోంది. ప్రతీ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి..వారితో కొద్ది సేపు మమేకం కావాలని సీఎం జగన్ ఇప్పటికే పలుమార్తు నిర్దేశం చేసారు. డిసెంబర్ లో జరిగి సమావేశంలో 32 మంది ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయి కంటే వెనుకబడి ఉన్నట్లుగా గుర్తించారు. వారికి ఈ నెల వరకు సమయం నిర్దేశించారు. ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకోకుంటే ప్రత్యామ్నాయం తప్పదని హెచ్చరించారు. వారి సేవలను పార్టీ మరో విధంగా వినియోగించుకుంటుందనే సంకేతాలు ఇచ్చారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా ఉండాలని అనుకోవటం లేదని. జగన్ ప్రస్తావిస్తున్నారు.

ప్రతీ నియోజకవర్గంలో గెలుపు దక్కాల్సిందేనని.. గెలుపే ప్రామాణికంగా టికెట్ కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. నేటి సమాశంలో ఎమ్మెల్యే పనితీరు.. టికెట్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది టీడీపీ – జనసేన పొత్తు వేళ టికెట్ల కేటాయింపు అంశంలో సీఎం జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే…సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వారి పని తీరు మాత్రమే టికెట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుందని స్పష్టం చేసారు.
ఇప్పుడు తాజాగా సర్వే నివేదికల్లో ఆ 32 మంది ఎమ్మెల్యేల కు సంబంధించి ఎం తేల్చారనేది కీలకంగా మారుతోంది. వారిలో తాజా-మాజీ మంత్రులతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం. ఇక.. పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటనలు చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పార్టీ నేతలంతా ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించనున్న ముఖ్యమంత్రి.. కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
అభ్యర్దులను ప్రకటించి ఎన్నికల వేడిని పెంచుతారో లేదా ఆసమ్మతి సెగ తగులుతుందని వెనక్కితగ్గుతారో చూడాలి ఏది ఎమైనా ఇటీవల నెల్లూరు పరిణామాలు, వేగవంతమైన వివేకానంద రెడ్డి హత్యకేసు దర్వాప్తు, ఢీల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు రానున్న రాజధానిపై తీర్పు జగన్ ముందున్న సమస్యలు.. వీటిని ఎలా ఎదుర్కోంటారో చూడాలి. మాటలు కోటలు దాటించి చేతలను గడపకు చేర్చ లేని కోటరీ విచక్షణ వీడి క్షణక్షణం ప్రతి పక్షం మీద వీరుచుకు పడి వీరాభిమానం చాటే విధేయుల విధిరాత మారనున్నదో లేదో వేచిచూడాలి. ముందస్తు బూచి కి ప్రతిపక్షం భయపడదని గ్రహించి పూర్తికాలం పాలన ఆందించి జగనన్న జనం వైపు అన్న నమ్మకాన్ని కలిగేలా కార్యాచరణ చేపట్టినరోజున మరోమారు విజయం తధ్యం. రాజకీయం నాటకీయ పరిణామాలకి పుట్టినిల్లు క్షణ క్షణం ఓటరు దేవుళ్ళ చిత్తం అన్నది జగనన్నకి తెలియాల్సిన జగమెరిగిన సత్యం .
శ్రీధర్ వాడవల్లి – హైదరాబాదు
