రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి నీటిప్రాజెక్టుల విషయంలో ఇరువురు సిఎంల మధ్య మంచి సఖ్యతే ఉంది కాబట్టి, ఒకసారి సమావేశమై చర్చించుకుంటే సమస్య పరిష్కారమై పోతుంది. అలా చేయకుండా కోర్టుల్లో పిటీషన్లు వేయడం, కృష్ణా-గోదావరి బోర్డులకి ఫిర్యాదులు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటంటూ జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడి ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనలోని లోపాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి జల జగడాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.