Kashmira Pardeshi Latest : తెలుగు సినిమాలో మరో అవకాశం దొరకటం తన భాగ్యం అంటున్న మరాఠీ చిన్నది..
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ.. మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ విడుదల చేశారు. లవ్ కాన్సెప్ట్ తో మొదలై కామెడీ మిక్సై క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు. కిరణ్ సరసన కశ్మీర పర్దేశీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా.. భాస్కర భట్ల ఈ సినిమాలో పాటలను రచించారు. చిత్రంలోని పాటలన్నింటికీ ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 18 ప్రేక్షకుల ముందుకు రాబోతొంది..
కొత్త విషయాలు నేర్చుకున్నా అంటున్న వినరో భాగ్యము విష్ణు కథ హీరోయిన్ కశ్మీర పర్దేశి..
‘నర్తనశాల’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ మరాఠీ చిన్నది.. కొంచెం విరామం తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’లో నటించింది. మహారాష్ట్ర రాజ్ పుత్ వంశానికి చెందిన ఫ్యాషన్ స్టూడెంట్ కశ్మీర పర్దేశి నటనపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్ చేసింది. ఆ తర్వాత 2018లో నాగశౌర్య హీరోగా నటించిన నర్తనశాల సినిమాలో నటించే అవకాశం రావడం జరిగింది. ఆ సినిమా తర్వాత డ్యాన్స్ పరంగా.. యాక్టింగ్ పరంగా ఇలా అన్ని రకాలుగా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంది.
నర్తనశాల సినిమా తర్వాత తిరుపతి నేపద్యంలో ఉన్న ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు తిరుపతితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. ఈ సినిమా చెయ్యడం వలన నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఒక ఎత్తయితే గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. గీతా ఆర్ట్స్ లో చేయడం నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది.’వినరో భాగ్యము.. విష్ణుకథ’ సినిమాకు సంబంధించి నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను చెన్నైలోని బాలాజీ దేవాలయంలో దేవుడి దర్శనంలో ఉన్నా. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర పేరు కూడా దర్శన కావడంతో ఓ సెంటిమెంట్‌గా భావించా” అని తన చెప్పుకొచ్చింది.