Rajani Kanth Remunaration : వామ్మో.. 7 రోజులకే 25 కోట్ల పారితోషకం.. ఎవరో తెలుసుగా..?
అవును మీరు విన్నది నిజమే.. కేవలం 7 రోజుల షూటింగ్ కి రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్న మొత్తం అక్షరాలా 25 కోట్లు.. ఇంత పెద్ద మొత్తం తీసుకుంటున్నది ఏ హాలీవుడ్ హీరోనో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. 7 రోజుల్లో అంత మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నది ఇండియన్ లెజెండరీ..తమిళ్ తలైవా రజినీకాంత్ ..

ఇండియన్ స్క్రీన్ అని కాకుండా విదేశీ స్క్రీన్ ల పై కూడా రజినీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఏదేని సినిమాలో గెస్ట్ రోల్ చేసినా కూడా ఆయన రేంజ్.. పాపులారీటి ఏ మాత్రం తగ్గదు.. తాజాగా విష్ణు విశాల్, విక్రాంత్ నటిస్తున్న తమిళ్ సినిమా “లాల్ సలాం” లో గెస్ట్ రోల్ చేస్తున్నారు రజినీకాంత్.
ఇందుకుగాను ఆయన నటించే ఏడు రోజులకి 25 కోట్లు ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ అయినటువంటి లైకా సంస్థ డీల్ కుదుర్చుకుంది.. మరోవైపు రజినీ హీరోగా రూపుదిద్దుకుంటున్న “జైలర్” సినిమా కోసం ఏకంగా 140 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ టాక్..
ఇవి కూడా చదవండి..
- Photos : తెలుగు సినిమాలో మరో అవకాశం దొరకటం తన భాగ్యం అంటున్న మరాఠీ చిన్నది..
- Rana Naidu Trailer : ట్రైలర్ అదిరిందిగా..!!
