Groom Refused Marriage : పాత మంచం ఇచ్చారని పెళ్లి రద్దు చేసుకున్న వరుడు… ఆపై అసలైన ఇంకో ట్విస్ట్..!!
పెళ్లిళ్ల విషయం లో ఈ మధ్య చాలా వింతలు విడ్డురాలు చూస్తున్నాం..అప్పట్లో కట్నం విషయం లో లేదా ఇంకేదో విషయం లో మాత్రమే పీఠల దగ్గరికి వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం..
కానీ నేటి రోజుల్లో చిత్ర విచిత్రమైన చిన్న చిన్న కారణాలకే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది.
ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్టలో మౌలాలికి చెందిన వరుడు జకరియా(26) కు బండ్లగూడ కి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయింది…నిన్న పెళ్లి జరగాల్సింది.
అయితే శనివారం వధువు తండ్రి వరుడి ఇంటికి మంచం తో పాటు ఇతర ఫర్నిచర్ పంపాడు అనవాయితీ లో భాగంగా.. పంపిన ఫర్నిచర్ పరిశీలిస్తుంటే మంచం విరిగింది.. దీనితో కోపం తెచ్చుకున్న వరుడు ఏకంగా పెళ్ళికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు.
ఆ తరువాత ఈ విషయం తెలుసుకొని పోలీసులు రంగప్రవేశం చేసి సదురు వరుడు అయిన జకారియాకి నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించారు.
ఇక మంచం విరిగితేనే పెళ్ళికి ఒప్పుకోలేదు అని.. పెళ్లి అయిన తరువాత తన కూతురు పరిస్థితి ఇంకెలా ఉంటుంది అని తండ్రి అనుకున్నాడేమో ఏమోగానీ.. తన కూతురిని ఆ ఇంటికి ఇచ్చేది లేదని పెళ్లి రద్దు చేశాడు వధువు తండ్రి.