Shamshabad Airport : శంషాబాద్ లో విమానం ఎక్కనివ్వని సిబ్బంది… కోపంలో ప్రయాణికుడు ఏం చేశాడో తెలుసా..??
సాధారణంగా విమానం ప్రయాణం చేసేవారు… ఒక్కోసారి సమయానికి ఎయిర్ పోర్ట్ చేరకుంటే అక్కడ ఉన్న సిబ్బంది విమానాశ్రయం లోనికి కానీ విమాన ప్రయాణానికి కానీ అనుమతించరు.
ఇక చేసేదేమి లేక అక్కడినుండి వెనుదిరగడమో లేక వేరే విధంగా అయినా రోడ్లు మార్గాన ప్రయాణం చేస్తుండడం చూస్తాం..
కానీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెన్నై వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన భద్రయ్య అనే ప్రయాణికుడిని “సమయం మించిపోయింది లోపలికి వెళ్ళడానికి వీల్లేదు” అని అడ్డుకోవడంతో..
దీనితో కోపంలో ఆ ప్రయాణికుడు భద్రయ్య ఏకంగా “విమానం లో బాంబ్ ఉందని ఫోన్ చేశాడు” భయటికి వచ్చాక .. దీనితో అప్రమత్తం అయిన CISF,శంషాబాద్ పోలీసులు చెన్నై వెళ్లే విమానం లో విస్తృత తనిఖీలు చేసి ఆఖరికి బాంబు లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు..
కోపంలో సిబ్బంది అడ్డుకోవడం తో బాంబు ఉందని అబద్దపు కాల్ తో ఫోన్ చేసిన భద్రయ్య ని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.