Bandla Ganesh Tweet: టాలీవుడ్ లో కమెడియన్ గా, నిర్మాతగా మాత్రమే కాకుండా వక్తగా కూడా బండ్ల గణేష్ కి మంచి గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్ల గణేష్ చేసే హడావుడి అందరికీ తెలిసిందే. బండ్ల స్పీచ్ లకి సైతం అభిమానులున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ పలు సందర్భాల్లో వివాదాస్పద ట్వీట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో సంచలన ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో మాట్లాడారు. వీరిని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యర్థులైన చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుతున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరు కూడా తారకరత్నకు ఇరువైపులా బంధువులు కావడంతో.. విషాద సమయంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ ఫోటోను ట్టిట్టర్ వేదికగా షేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
“నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!” అంటూ ట్వీట్ చేశారు. దీంతో బండ్ల గణేష్ తీరును తప్పుబడుతూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! pic.twitter.com/ENGbX3oRP5— BANDLA GANESH. (@ganeshbandla) February 20, 2023