సినీతారలు షూటింగ్ ఉన్నప్పుడు ఇంటి ముఖం చూడాలంటే నెలల సమయం పడుతుంది.వారికి తీరిక సమయం ఉండనే ఉండదు. ఉదయం నుండీ రాత్రి వరకూ షూటింగ్ లు,ప్రయాణాలు, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో నిమిషం తీరిక లేకుండా గడుపుతుంటారు.
కానీ నవ తరం నాయికలు అటు సినిమా ఇటు ఆరోగ్యం
రెండు బాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా వలన షూటింగ్లకు బ్రేక్ రావడం తారలందరూ ఇంటిపట్టునే ఉండడం తీరిక సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా గడుపుతున్నారు.
హీరోయిన్ రాశి ఖన్నా విషయంలోకి వస్తే తన తీరిక సమయంలో ఎక్కువ వ్యాయామం చేయడానికి ప్రశాంతంగా నిద్రపోవడానికి కేటాయిస్తానని. అదే తన అందం వెనుక ఉన్న రహస్యమని చెప్పింది. కడుపు కాల్చుకుంటూ ఏమీ తినకుండా ఉండే కంటే కడుపునిండా తిని కష్టపడి వ్యాయామం చేసి రెండింటిని సమతుల్యం చేసుకుంటానని తన సోషల్ మీడియా లో పై విషయాలను అభిమానులతో పంచుకుంది.
