Mahesh Babu Saved Another Child : ఆపదలో ఉన్న చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన ప్రిన్స్ మహేష్ బాబు…. దటీజ్ మహేష్ అంటూ అభిమానుల జేజేలు
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సంచలనం. తెలుగు అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతూ పలు ఇండస్ట్రీ హిట్ లు సొంతం చేసుకున్న ఘనత మహేష్ ది. లెక్కకు మించి ఇప్పటికే బ్లాక్ బస్టర్ లు ఇప్పటికే తన పేరు మీద లిఖించుకున్న మహేష్ లో మరో సేవా కోణం కూడా ఉందనే విషయం తెలిసిందే.
ఈ రోజుల్లో ఎవరైనా చిన్న సేవా కార్యక్రమం చేస్తేనే బోలెడంత పబ్లిసిటీ చేసుకుంటారు. అలాంటిది మహేష్ బాబు MB అనే తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకి అంత్యంత ఖరీదైన గుండె ఆపరేషన్ లు ఉచితంగా చేయించారు. పైగా ఎక్కడ, ఏ వేదిక పై గానీ ప్రచారం చేసుకోని, పబ్లిసిటీ కోరుకోని గొప్ప మనసున్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు.

తాజాగా ఆయన తన MB ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారికి చేసిన గుండె ఆపరేషన్ పై ప్రముఖ నిర్మాత నాగవంశీ తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం పై నాగవంశీ “మొన్న ఒకతను నాకు ఫోన్ చేసి చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాలి,పేదరికం వల్ల ఏం చేయాలో తోచట్లేదు అని చెప్పారని .అయితే ఆ విషయం నమ్రత గారికి తెలియజేసి,ఆ చిన్నారికి సంభందించిన వివరాలు MB ఫౌండేషన్ కి పంపాను,రెండు వారాల తరువాత ఈ రోజు విజయవంతం గా సర్జరీ జరిగింది” అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
