Morning Motivation : మేల్కొలుపు – 2
ఎవరి గురించి వారే తెలుసుకోవాలి..!!
విత్తనంలో మహా వృక్షం దాగి వున్నట్లు..ప్రతి వారిలోనూ అపరిమిత శక్తులు దాగి వుంటాయి.
వాటిని గుర్తించి సానబెట్టి సమున్నత వ్యక్తిత్వాన్ని సాధించుకోవచ్చు.
మనకి ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు..ఆ ఉన్నదానితో మనం ఎంత సుఖంగా ఉన్నాము అనేదే ముఖ్యం.
భయం తలుపు తట్టినపుడు..ఆత్మ విశ్వాసం తలుపు తీయాలి.
అపుడు భయం జడుసుకుని పారిపోతుంది.
గెలుపును ప్రేమించు..ఓటమిని ద్వేషించకు.
ఓటమి నేర్పే విలువైన పాఠాలే గొప్ప గెలుపుకు కారణం అవుతాయి.
ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులు కాదు.
జీవితంలో ప్రతీ బంధానికి…
ప్రతీ ఒక్కరికి…
అర్హతకు మించి ప్రేమని,విలువని ఇచ్చి..తమ సంతోషాన్ని కోల్పోయినవారై ఉంటారు.
ఎక్కువగా ఎవరినీ నమ్మకు…మోసపోతావు.
ఎవరికోసమూ ఆలోచించకు…వాళ్ళకే అలుసైపోతావు.
ఎక్కువ విలువ ఇవ్వకు…గౌరవాన్ని కోల్పోతావు.
ఎవరినీ ప్రశ్నించకు…శత్రువు అవుతావు.
ముందుగా “నా వాళ్ళు” అని ఆలోచించడం తగ్గించు
ఎవరి నుంచీ ఏం ఆశించకు…జీవితం బావుంటుంది.
చూసిందల్లా కోరుకోవడం మనసు చేసే పని…
రాసుకున్నదే ఇవ్వడం భగవంతుడు చేసే పని..
భరించలేని బాధనూ..పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది..మనసుకు నచ్చిన వారు మాత్రమే.
మన వల్ల ఇబ్బంది పడే వారిని..మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా..మనమే దూరంగా ఉండటం మంచిది.
దుఃఖం పరిచయం అయినప్పుడే..నవ్వు విలువ తెలుస్తుంది.
కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం అనేది మన వశం అవుతుంది.
బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది.
సమస్య తలెత్తినపుడే మన సామర్థ్యం బయటపడుతుంది.
మంచి వారితో కలసి మెలసి తిరగడం అంటే..వంటికి మంచి గంధము పూసుకోవడం వంటిది.
అది శరీర దుర్గంధాన్ని ఎలా దూరం చేస్తుందో..అలాగే
ఒక మంచివాడితో స్నేహం మనలోని అవలక్షణాలను దూరం చేస్తుంది.
శుభోదయం