Pawan Kalyan Donation :కార్యకర్తల ప్రమాద భీమాకి కోటి విరాళం ఇచ్చిన జనసేన అధినేత పవన్కళ్యాణ్
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఇటీవలే రాష్ట్రంలో పార్టీ విస్తరణ.. బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం చేపట్టారు.ఇందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులుకి పలు సూచనలు చేశారు.అందరూ కలిసి సభ్యత్వ నమోదు చేయించి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని అలాగే జనసేన భావజాలాన్నీ ప్రజలందరికీ వివరించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలు ప్రభుత్వ వైఖరి వల్ల దుర్భర అవస్థలు పడుతుంటే ఆ రైతు కుటుంబాలకు లక్ష చొప్పున తన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా జనసేన కార్యకర్తల కోసం,క్రియాశీల కార్యకర్తల సంక్షేమం కోసం ఏకంగా కోటి విరాళం ప్రకటించారు జనసేనని.ఈ చెక్కుని బుధవారం పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కి అందించారు.పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద భీమాకి గత మూడేళ్ళుగా విరాళం ఇస్తూ వస్తున్నారు.రాబోయే వారం రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.జనసేన కోసం కార్యకర్తలు డబ్బు లేకుండా, ఏమీ ఆశించకుండా పనిచేస్తారని కొనియాడారు.
