Anasuya Bharadwaj: ఎప్పటిలాగే మైమరిపించిన అనసూయ.. పద్దతైన బట్టల్లోనే పరువాలు ఒలకబోస్తూ..!
Anasuya Bharadwaj: తెలుగు టెలివిజన్, సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన టాలెంట్‌తో ఓవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తున్న ఈమె తాజాగా.. సంప్రదాయ లుక్‌లో కనిపించి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఎప్పుడూ తన గ్లామరస్, ట్రెండీ అవుట్‌ఫిట్‌లతో ఆకట్టుకునే అనసూయ.. చీరకట్టులో దర్శనమివ్వగానే ఆమె అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
దాదాపు దశాబ్ద కాలంగా ‘జబర్దస్త్’ కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరించి, ఇంటింటికీ సుపరిచితురాలైన అనసూయ తన వాక్ చాతుర్యం, నృత్య ప్రతిభ, స్క్రీన్‌పై ఆమెకున్న అద్భుతమైన నటనతో స్టార్ యాంకర్‌గా ఎదిగారు. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని ఆమె వెండితెరపై కూడా అడుగు పెట్టారు. మొదట్లో కొన్ని ప్రత్యేక పాటల్లో కనిపించినా ఆ తర్వాత విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తన సత్తా చాటుకున్నారు. ఆమె పోషించిన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

ఓవైపు సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటుంది అనసూయ. తన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఒక అందమైన చీరకట్టులో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో ఆమె సాంప్రదాయ దుస్తుల్లో కవ్వించే భంగిమల్లో కనిపిస్తూ.. తన ఆకర్షణీయమైన రూపంతో నెటిజన్లను కట్టిపడేశారు. ఈ ప్రత్యేక ఫోటోషూట్ ‘జబర్దస్త్’ షో 12వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా మోడ్రన్ దుస్తులలో మెరిసే అనసూయ.. సంప్రదాయ చీరలో కనిపించగానే ఆమె లుక్‌లో ఒక ప్రత్యేకమైన శోభ ఉట్టిపడుతోంది. ఈ ఫోటోలలో ఆమె ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తూ, తన సహజ సౌందర్యంతో అభిమానుల మనసు దోచుకుంటోంది. అను చీరకట్టుకు తగిన ఆభరణాలు, అలంకరణ ఆమె అందాన్ని మరింత పెంచేశాయి. ఆడాళ్ల అసూయ పడేలా కనిపిస్తున్న అనసూయ.. ఫొటోలు చూసిన కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఏమందం అను అంటూ కామెంట్లు చేస్తున్నారు. లైకులు, కామెంట్లు, షేర్లతో రెచ్చిపోతున్నారు. మరి ఈ ఫొటోలు చూస్తే మీకేమనిపిస్తోందో కామెంట్ల రూపంలో తెలియజేసేయండి.
