Faria Abdullah: మత్తు చూపులతో మైమరిపిస్తున్న చిట్టి.. మంచంపై ఉండే ఫొటోలకు ఫోజులు
Faria Abdullah: టాలీవుడ్‌లో ‘జాతి రత్నాలు’ సినిమాతో అరంగేట్రం చేసి యువత మనసు దోచుకున్న నటి ఫరియా అబ్దుల్లా. తన మొదటి సినిమాతోనే ‘చిట్టి’ పాత్రలో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా విజయం తరువాత ఫరియాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. నటనతో పాటు ఆమె స్టైలిష్ లుక్స్, ఫ్యాషన్ సెన్స్‌తోనూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటారు.
తన గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. రీల్స్, లేటెస్ ఫొటోషూట్ లను పంచుకుంటూ ఉంటుంది. డ్యాన్స్ తో అలరించడమే కాకుండా, లేటెస్ట్ ఫ్యాషన్ వేర్స్ లో ధరించి ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా ఫరియా అబ్దుల్లా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఫరియా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆమె ధరించిన నయా ఫ్యాషన్ డ్రెస్, దానికి తగ్గ హెయిర్ స్టైల్, మేకప్ ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఈ ఫోటోషూట్‌లో ఆమె ఇచ్చిన ఫోజులు మైమరిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతున్నారు. కొందరు ఆమె స్టైల్‌ను ప్రశంసిస్తే, మరికొందరు ఆమె నవ్వు, కళ్లకు ఫిదా అయ్యారు.

జాతి రత్నాలు తర్వాత బంగార్రాజు, రావణాసుర వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో మెరిసిన ఫరియా, ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫరియా కెరీర్‌కు మరో మైలురాయి అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నటిగా, మోడల్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఫరియా, భవిష్యత్తులో మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి ఫొటోషూట్‌లు ఆమె క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయని చెప్పవచ్చు.
