Aishwarya Rajesh: పట్టుచీరల్లో చందమామా.. మన భాగ్యం అందాల ముందుగుమ్మ!
Aishwarya Rajesh: సినీ పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో అందరినీ కట్టిపడేసే ఈమె.. భాగ్యం పాత్రలో భలేగా ఇరగదీసింది. ఈ సినిమా తర్వాత నుంచి ఈమెకు ఫ్యాన్ బేస్ కూడా విపరీతంగా పెరిగిపోగా.. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులానే కనిపిస్తూ.. అందరినీ అలరిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా కూడా పద్ధతైన బట్టల్లో పరువాలు ఆరబోసింది. పెళ్లి కూతురిలా పట్టు చీర కట్టుకుని.. చందమామలా మెరిసిపోయింది.
తొలినాళ్లలో సవాళ్లను ఎదుర్కొన్న ఐశ్వర్య..
తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు నటీమణులకు సరైన అవకాశాలు లభించడం లేదంటూ తరచుగా వినిపిస్తున్న ఆవేదన మనకు తెలిసిందే. ఈ సమస్యను ఐశ్వర్య రాజేష్ కూడా ఎదుర్కొన్నారు. ఆమె డస్కీ బ్యూటీ అయినప్పటికీ.. తన అపారమైన నటనా ప్రతిభతో కోలీవుడ్‌లో అగ్ర నటిగా ఎదిగారు. రూపం కంటే ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుందని నిరూపించారు. కేవలం అందం మీద ఆధార పడకుండా.. కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించారు. సినిమా పరిశ్రమలో అనేక అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్న ఐశ్వర్య, తనలాంటి ఎందరో అమ్మాయిలకు ఒక స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
ఐశ్వర్య రాజేష్ దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె కాగా.. సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మికి ఈమె మేనకోడలు. చెన్నైలో 1990, జనవరి 10న జన్మించిన ఐశ్వర్య, తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత చెన్నైలో బీ.కాం పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌గా అడుగుపెట్టక ముందే.. 1995లో వచ్చిన ‘రాంబంటు’ సినిమాలో బాలనటిగా నటించి మెప్పించారు. 2010లో ‘ఇంద్రసేన’ సినిమాతో కథానాయికగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి.. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ నటించారు. ఇది ఆమెను ఒక ప్రత్యేకమైన నటిగా నిలబెట్టేందుకు దోహదపడింది.
2020లో తమిళనాడు ప్రభుత్వం ఐశ్వర్య రాజేష్‌ను ప్రతిష్టాత్మకమైన కలైమామణి పురస్కారంతో సత్కరించింది. ఇది ఆమె ప్రతిభకు లభించిన ఒక గొప్ప గౌరవం. ప్రస్తుతం, ఆమె తమిళంలో ‘కరుప్పర్ నగరం’, ‘మోహన్‌దాస్’, ‘తీయవర్ కులైగల్ నడుంగ’ వంటి చిత్రాలలోనూ, కన్నడలో ‘ఉత్తరకాండ’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ హిట్ సాధించినప్పటికీ, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆమెకు ఇప్పటికీ అవకాశాలు పెద్దగా లభించకపోవడం ఆశ్చర్యకరం. అయినా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అందమైన ఫొటోలు, సినిమా అప్‌డేట్లను ఇస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పట్టుచీర కట్టుకుని పరువాలు ఆరబోసింది. అందంగా కనిపిస్తూ.. కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఈమె ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ భాగ్యం అదిరిపోయావు, రోజ్ మిల్క్ కంటే నీవే బాగున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె ఫొటోలు చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.