Ananya Nagalla: ఏమా అందం అనన్య.. పట్టు వస్త్రాల్లోనూ పిచ్చిలేపుపుతున్నావ్‌గా..!
Ananya Nagalla: టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. సంప్రదాయ చీరకట్టులో, తెలుగింటి ఆడపడుచులా ఆమె ఫోజులిచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన సహజమైన అందం, అద్భుతమైన నటనతో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్న అనన్య, ఇప్పుడు తన కొత్త ఫొటోషూట్‌తో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు.
ముఖ్యంగా, చీరకట్టులో అనన్య ఇచ్చిన ఫోజులు ఆమెకు మరింత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముగ్ధ మనోహరమైన చూపులతో, మెరిసే నవ్వులతో ఆమె కట్టిపడేస్తున్నారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. అనన్య అందానికి సంప్రదాయ దుస్తులు మరింత వన్నె తెచ్చాయని కామెంట్లు పెడుతున్నారు.
‘వకీల్ సాబ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన అనన్య, ఆ చిత్రంలో పోషించిన పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు. అంతకుముందు ‘మల్లేశం’ సినిమాతో నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మొదటి సినిమాతోనే నటనలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే, ‘వకీల్ సాబ్’ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.
అనన్య కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోషూట్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ట్రెండీ డ్రెస్సుల నుంచి సాంప్రదాయ దుస్తుల వరకు ఏ స్టైల్‌లో అయినా ఆమె చాలా అందంగా కనిపిస్తారు. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
తెలంగాణ సత్తుపల్లిలో జన్మించిన ఈ తెలుగు బ్యూటీ హైదరాబాద్‌లోనే తన విద్యాభాసాన్ని పూర్తి చేసుకుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇన్ఫోసిస్‌లో కొన్ని రోజులు జాబ్ కూడా చేసింది. 2017లో షాదీ అనే షార్ట్ ఫిల్మ్‌తో ప్రేక్షకులను అలరించింది. తనకూ మంచి గుర్తింపు దక్కింది. ఇక హీరోయిన్ గా 2019లో మల్లేశం అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన నటించి మెప్పించింది. ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలవడం విశేషం. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంది.