Anchor Vishnupriya: గ్లామర్ డోస్ పెంచుతున్న యాంకర్ విష్ణుప్రియ.. నడుము అందాలతో మంటలు
Anchor Vishnupriya: బుల్లితెరపై తన ప్రత్యేకమైన శైలి, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ విష్ణుప్రియ, ఇప్పుడు మరింత బోల్డ్‌గా కనిపిస్తూ వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు, ఆమె కెరీర్ విషయంలో తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.
జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత ‘పోవే పోరా’ వంటి టీవీ షోలతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ, ఆ క్రేజ్‌తో వెండితెరకు కూడా పరిచయమయ్యారు. ‘చెక్ మేట్’, ‘వాంటెడ్ పండుగాడ్’ వంటి సినిమాల్లో నటించారు. అయితే, ఆ చిత్రాలు ఆమెకు ఆశించిన విజయాన్ని తెచ్చిపెట్టలేదు. ఈ మధ్యకాలంలో టీవీ షోల్లో అవకాశాలు తగ్గడంతో, ఆమె తన గ్లామర్ డోస్ పెంచుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌పై దృష్టి పెట్టారు.

అలాగే.. ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో మెయిన్ లో నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది విష్ణు ప్రియ. అంతేకాదు. అలాగే..ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విష్ణుప్రియ తన అందాల ఆరబోత అదరగొడుతోంది.తన డ్యాన్స్‌తో కుర్రకారును ఊర్రూలూగించింది. ఈ క్రమంలోనే ఆమె నటించిన ‘జరీ జరీ పంచెకట్టి’ అనే ప్రైవేట్ సాంగ్ మంచి ఆదరణ పొందింది. ఆ పాటలో ఆమె చూపించిన గ్లామర్ ఆమె ఇమేజ్‌ను మరింత మార్చేసింది. ఇదిలా ఉండగా, ఇటీవలి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో విష్ణుప్రియ పాల్గొని మరింత పాపులారిటీ సాధించారు. ఆ షోలో సహ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ శెట్టితో ఆమె నడిపిన లవ్ ట్రాక్ కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.

అయితే, బిగ్ బాస్ తర్వాత కూడా ఆమె కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో అవకాశాల కోసం ఆమె మరింత బోల్డ్ పాత్రలకు సిద్ధమవుతున్నారని, తన గ్లామర్‌ను ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఆమె తాజా ఫోటోషూట్‌లు, పోస్ట్‌లు ఈ వాదనకు బలాన్ని ఇస్తున్నాయి. విష్ణుప్రియ ఈ కొత్త పంథాలో ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.
