Ashu Reddy: దానికి కూడా సమయం ఇవ్వండి.. బిగ్ బాస్ అషు రెడ్డి ఇంట్రెస్టింగ్ పోస్ట్
Ashu Reddy: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అషు రెడ్డి. డబ్ స్మాష్ వీడియోలతో ‘జూనియర్ సమంత’గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత పాపులారిటీ సాధించారు. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో అషు ఒక్కసారిగా సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అషురెడ్డి ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కొనసాగుతున్నారు.

బిగ్ బాస్‌తో మరింత పాపులారిటీ
కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లోకి కంటెస్టెంట్‌గా అషు రెడ్డి అడుగుపెట్టారు. హౌజ్‌లో తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించారు. టాస్క్‌లలో తన సత్తా చాటుతూ మంచి గుర్తింపు పొందారు. బిగ్ బాస్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత పలు టీవీ షోల్లో మెరిసి సందడి చేసింది. ఇక సోషల్ మీడియాలోనూ అషు రెడ్డి నిత్యం యాక్టివ్ గానే ఉంటూ ఉంటుంది. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అభిమానుల కోసం అందమైన సందేశం
తాజాగా, అషు రెడ్డి తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రకృతి మధ్యలో ఆమె తీసుకున్న ఈ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలతో పాటు అషు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. “ప్రతి ఒక్కరూ ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ బిజీ జీవితంలో కాస్త సమయం కేటాయించి ప్రశాంతంగా జీవించాలి” అని ఆమె సూచించారు. అషు రెడ్డి చెప్పిన ఈ మాటలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఆరెంజ్ కలర్ టాప్‌లో అదిరిపోయే అందాలను ఆరబోసింది అషు రెడ్డి. తన మైమరిపించే యవ్వనాలతో కుర్రకారు మతిపోగోట్టింది.
