Pujiitaa Ponnada: పూజిత పొన్నాడ అందాల విందు.. కవ్వించే వలపులతో ఫోటోలకు ఫోజులు
Pujiitaa Ponnada: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే, అందం, అభినయం ఉన్నప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతున్న నటి పూజిత పొన్నాడ. తన ప్రతిభకు తగ్గ పాత్రలు రావడం లేదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
విశాఖపట్నంలో పుట్టి, చెన్నైలో పెరిగిన పూజిత పొన్నాడ, సినిమాలపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేశారు. బీటెక్ పూర్తి చేసి టీసీఎస్‌లో పనిచేసిన ఆమె, మొదట షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత, 2015లో వచ్చిన ‘ఊపిరి’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అయితే, ఆమెకు నిజమైన గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయసిగా, లంగా ఓణీలో సాంప్రదాయబద్ధంగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ పాత్ర ఆమె కెరీర్‌కు ఒక మలుపునిచ్చింది.
‘రంగస్థలం’ తర్వాత ఆమె ‘ప్రేమమ్’, ‘దర్శకుడు’, ‘రాజుగాడు’, ‘బ్రాండ్ బాబు’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’లో కూడా ఆమె ఒక కీలక పాత్రలో మెరిశారు. ప్రధాన హీరోయిన్ పాత్రలు రాకపోయినా, రెండో హీరోయిన్‌గా లేదా ఇతర ముఖ్య పాత్రల్లో నటించడానికి కూడా ఆమె వెనుకాడటం లేదు. ప్రస్తుతం ఆమె తమిళ చిత్రం ‘భగవాన్’లో నటిస్తున్నారు.
పూజిత కెరీర్ తెలుగు అమ్మాయిల కష్టాలకు అద్దం పడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా సరే, అవకాశాలు అందిపుచ్చుకుంటూ, సోషల్ మీడియాలో అభిమానులకు చేరువవుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.