Iswarya Menon: సాంప్రదాయ దుస్తుల్లో అందాల ఐశ్వర్యం.. చూస్తే మతిపోవాల్సిందే!
Iswarya Menon: మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ తక్కువ సమయంలోనే తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. గ్లామరస్ బ్యూటీతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది. ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా ఫోటోలు ఇప్పుడు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పట్టు లెహెంగాలో ఆమె సంప్రదాయ, అధునాతన అందాలను కలబోసి కనిపించిన తీరు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్పై’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి, తన సొగసుతో ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది.
ఈ ఫోటోల్లో, ఐశ్వర్య మీనన్ బంగారు, ఆకుపచ్చ రంగులతో కూడిన అందమైన లెహెంగా ధరించి కనిపించారు. డిజైనర్ బ్లౌజ్, దానిపై ఉన్నపట్టీ ఎంబ్రాయిడరీ, దుపట్టా ఆమెకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. ఈ సంప్రదాయ దుస్తులకు తగ్గట్టుగా ఆమె అంచులతో అలంకరించిన దుపట్టాను అందంగా కప్పుకుంది. ఆభరణాల విషయంలో కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపించింది. సున్నితమైన చోకర్ నెక్లెస్, పెద్ద ఇయర్ రింగ్స్, గాజులు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఈ లుక్‌లో ఐశ్వర్యా మీనన్ చాలా అందంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోలను ఐశ్వర్యా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే, అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె అందం, ఫ్యాషన్ సెన్స్, ఆభరణాల ఎంపిక పట్ల నెటిజన్లు కామెంట్లు హోరెత్తిస్తున్నారు. సినిమా విషయానికొస్తే, ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘భజే వాయు వేగం’ చిత్ర విజయం తర్వాత ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.
ఐశ్వర్య మీనన్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో ‘తీయ వేళై సెయ్యనుమ్ కుమారు’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందారు. కన్నడలో ‘దసవాల’ చిత్రంతో అరంగేట్రం చేసి, తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆమె ఫ్యాషన్, నటన సామర్థ్యం రెండింటితోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు.