Mehreen Kaur: మెహ్రీన్ మతిపోగొట్టెన్.. సాంప్రదాయ దుస్తుల్లో కవ్విస్తున్న హీరోయిన్
Mehreen Kaur: నటి మెహ్రీన్ కౌర్ పిర్జాదా తన తాజా ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ, తన గ్లామర్ అప్‌డేట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జన్మించిన మెహ్రీన్, కేవలం పదేళ్ల వయసులోనే ర్యాంప్ వాక్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2013లో ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా కెనడా’ కిరీటాన్ని గెలుచుకుని మోడలింగ్‌లో మరింత ముందుకు సాగారు. దేశంలోని పలు ప్రముఖ బ్రాండ్లకు ఆమె మోడల్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తన అమాయకమైన చూపులతో, అందంతో తెలుగు యువత హృదయాలను గెలుచుకున్నారు.

మెహ్రీన్ నటించిన తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, పంజాబీ చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయ్యింది. ఈ అనూహ్య పరిణామం అప్పట్లో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తున్నారు.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మెహ్రీన్ కౌర్ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటూ వస్తున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు తన అప్డేట్ లు పంచుకుంటారు. సాంప్రదాయ దుస్తుల నుంచి మోడర్న్ దుస్తుల వరకు రకరకాల ఫ్యాషన్ వేర్ ధరిస్తూ మైమరిపించే తన అందచందాలను ఆరబోస్తూ తన అభిమానులకు కిర్రెక్కిస్తుంటారు.
