Nabha Natesh: హాట్‌నెస్‌కు అర్థం చెబుతున్న నభా నటేష్.. ఆ అందాలను మీరే చూసేయండి
Nabha Natesh: సినిమా రంగంలో అందం, అభినయం, టాలెంట్ ఉన్నప్పటికీ చాలామంది నటీమణులకు సరైన అవకాశాలు లభించవు. కన్నడ నటి నభా నటేష్ కూడా ఇదే కోవలోకి వస్తారు. సుధీర్ బాబుతో కలిసి ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘నన్ను దోచుకుందువటే’తో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ నభాకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాతే ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
కర్ణాటకలోని శృంగేరిలో డిసెంబర్ 11, 1995న జన్మించిన నభా నటేష్ భరతనాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో శిక్షణ పొందారు. ఆమె 19 ఏళ్ల వయసులోనే కన్నడలో ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ నటించిన ‘వజ్రకాయ’ చిత్రంతో హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాలలో నటించారు. ‘మ్యాస్ట్రో’ తర్వాత ఆమె మూడు సంవత్సరాల విరామం తీసుకుని, 2024లో చివరిసారిగా ‘డార్లింగ్’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె ఏ కొత్త ప్రాజెక్టును ఒప్పుకోలేదు.

సినిమాలు చేయకపోయినా నభా మాత్రం తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ట్రెండీ దుస్తులు ధరించి తన అందచందాలను ఆరబోస్తూనే ఉంది. తాజాగా తను పోస్టు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. కాగా.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి తాను ఎంత కష్టపడింది నభా ఈ సందర్భంగా వివరించారు. బెంగళూరులో మోడలింగ్ చేస్తూ, ఒక నాటక బృందంతో కలిసి వీధుల్లో నాటకాలు వేసినట్లు తెలిపారు.

ఆ అనుభవంతోనే ‘వజ్రకాయ’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నానని చెప్పారు. ఆ సినిమా కోసం మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నానని, అందులో పల్లెటూరి అమ్మాయిలా కనిపించడం కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడంతో పాటు, బీడీలు కాల్చానని నభా తెలిపారు. బీడీల వాసన కారణంగా కొద్దిరోజులు భోజనం కూడా చేయలేకపోయానని బాధపడ్డారు. అయినప్పటికీ, తన కష్టానికి ప్రతిఫలంగా ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించిందని ఆమె గుర్తు చేసుకున్నారు.
