Nabha Natesh: బ్లాక్ జాకెట్‌లో నభా అందాల విందు.. రైడ్‌కు రెడీ అంటూ ఫోజులు
Nabha Natesh: టాలీవుడ్ ప్రేక్షకులను ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న నటి నభా నటేష్, ప్రస్తుతం సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోషూట్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో నభా నటేష్ బ్లాక్ కలర్ జాకెట్‌లో కనిపించి కవ్వించింది. హాట్‌నెస్‌కు కొత్త నిర్వచనం చెప్పింది.
బ్లాక్ కలర్ బైక్‌పై బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబోలో ఉన్న లెదర్ జాకెట్ ధరించి వయ్యారంగా బైక్‌పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. తన అందచందాలతో మైమరించింది నభా. హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారును పిచ్చెక్కించే వంపుసొంపులు ఒలకబోసింది. నభా అందాల విందుకు కుర్రకారు కిర్రెక్కాల్సిందే. బైక్‌పై కూర్చొని హాట్ రైడ్‌కు నేను రెడీ మీరు రెడీనా అన్నట్లుగా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ పరంగా కొంత విరామం తీసుకున్న నభా, తన నటనతో మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆమె కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కథలు వింటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమకు తిరిగి రాకముందే, ఇలాంటి స్టైలిష్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు.
నభా నటేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఫ్యాషన్ ప్రియులు, ఆమె అభిమానులు ఆమె లుక్‌ను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. హాట్ మోడరన్ లుక్ లో నభా అందాలను తెగ పొగిడేస్తున్నారు.
11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని ఆధ్యాత్మిక పట్టణం శృంగేరీలో జన్మించారు నభా నటేష్. బీటెక్ చదివిన ఈ ముద్దుగుమ్మ తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టారు. భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో శిక్షణ తీసుకోవడంతో పాటు పలు ప్రదర్శనలు ఇచ్చారు నభా నటేష్. 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగువారిని పలకరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ నభా నటన, లుక్స్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తద్వారా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది.