Nidhhi Agerwal: ఎర్ర చీరలో మందార పువ్వులా మెరిసిపోతున్న అందాల ‘నిధి’..
Nidhhi Agerwal: టాలీవుడ్ తెరపై తనదైన ముద్ర వేసుకుంటున్న కథానాయిక నిధి అగర్వాల్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘హరి హర వీరమల్లు’ వంటి భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం అయ్యారు. ఈ రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగిపోవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జూలై 24వ తేదీన హరిహర వీరమల్లు విడుదల
నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ నిధి అగర్వాల్ తనదైన శైలిలో పాల్గొంటూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తున్నారు.

తాజాగా నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని అందమైన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో ఆమె ఎరుపు రంగు చీరలో మెరిసిపోతూ.. ఎర్ర మందారంలా దర్శనం ఇచ్చారు. నిధి అగర్వాల్‌లోని సహజ సౌందర్యం, చీరకట్టులో ఆమె ఒంపుసొంపులు చిసిన నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషలు కూడా..
నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా ఆమెకు తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ భాషలు కూడా వచ్చు. ప్రస్తుతానికి ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. కానీ ముందు ముందు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ అందాల ముద్దుగుమ్మ ఎలాంటి చిత్రాల్లో నటించి, ఎంతటి స్థాయికి ఎదుగుతుందో.
