Nidhhi Agerwal: ఎర్ర చీరలో తలుక్కుమన్న అందాల నిధి..!
Nidhhi Agerwal: టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా నిధి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్‌డ్ టాక్ అందుకుంది.
సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిధి, తాజాగా తన అభిమానుల కోసం రెడ్ శారీలో కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేశారు. నిధి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో ఆమె ఎర్రటి శారీలో మెరిసిపోతూ అభిమానుల మనసులను దోచుకున్నారు. ఈ ఫోటోలకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి.
హరిహర వీరమల్లుతో పాటు, నిధి అగర్వాల్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కూడా భాగమయ్యారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ రెండు భారీ చిత్రాలు నిధి అగర్వాల్ కెరీర్ లో కొత్త మైలురాయిని చేరుకోనున్నాయి. నిధి అగర్వాల్ కు హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ చిత్రాలు రెండు కూడా అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. నిధి అగర్వాల్ తన గ్లామర్, టాలెంట్ తో త్వరలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరాలని ఆకాంక్షిస్తున్నారు.
17 ఆగస్ట్ 1992న హైదరాబాద్‌లో స్థిరపడిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు నిధి అగర్వాల్. మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ భామ .. సినిమాలపై ఆసక్తితో 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్‌తో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనంతం అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచితో తెలుగువారిని పలకరించారు నిధి అగర్వాల్