Pragya Jaiswal: బ్లాక్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. సరికొత్త అందాలను మీరూ చూసేయండి
Pragya Jaiswal: టాలీవుడ్ కథానాయిక ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అభిమానులను అలరిస్తున్నారు. బ్లాక్ కలర్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపిస్తున్న ఆమె తాజా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్‌గా మారాయి. తన అందం, ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ, సినీ కెరీర్‌లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.

‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్, ఆ తర్వాత అశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినప్పటికీ, తన ఫ్యాషన్ సెన్స్‌తో మాత్రం ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటూనే ఉన్నారు. అలా తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉన్నారు. ఆమె కట్టుబొట్టు, గ్లామరస్ లుక్స్ ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. నిజానికి, ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి వచ్చి మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ మొదట లాయర్ కావాలని ఆశపడ్డారు. పూణేలోని సింబియాసిస్ లా స్కూల్‌లో చదువుకున్న ఆమె, ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. పలు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొని, దేశంలోని ప్రముఖ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించారు. 2014లో విరుట్టు అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత 2015లో బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ హీరోగా వచ్చిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు ప్రగ్యా.

ఈ దశలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కళ్లలో పడ్డారు ప్రగ్యా జైస్వాల్. ఆయన దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచెలో ప్రగ్యాకు అవకాశం దక్కింది. ఆ సినిమాలో ప్రగ్యా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో రాయల్ లుక్‌లో జమీందార్ కూతురిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. క్యూట్ లుక్స్, అందమైన రూపం, కట్టుబొట్టుతో కుర్రకారుకు మెంటలెక్కించింది ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత ‘గుంటూరోడు’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘జయ జానకీ నాయక’ వంటి సినిమాల్లో నటించారు. ఒక దశలో అవకాశాలు తగ్గుతున్న తరుణంలో, ఆమెకు ‘అఖండ’ సినిమా బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘అఖండ 2’, ‘టైసన్ నాయుడు’ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
