Priyanka Jawalkar: చీరలో జాలువారే అందాలతో జవాల్కర్.. ఏమందం గురూ..!
Priyanka Jawalkar: ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి కొద్దిమంది తెలుగు నటీమణుల్లో ప్రియాంక జవాల్కర్ ఒకరు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ట్యాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్ గా అందరి దృష్టిలో పడింది ఈ ముద్దుగుమ్మ. అయితే అంతకుముంందే కలవరమాయే సినిమాతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో ఈ బ్యూటీ గురించి కూడా జనాలకు తెలియకుండా పోయింది. ట్యాక్సీవాలా మూవీలో తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. తన వయ్యారాలు ఒలకబోసింది. ట్యాక్సీవాలా సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ అందచందాలతో అదరహో అనిపించిన ప్రియాంక జవాల్కర్‌కు అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు.
ఆ తర్వాత సత్యదేవ్ సరసన తిమ్మరసు చేసింది. నెక్ట్స్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. గమనం సినిమాలోనూ నటించింది. టిల్లూ స్క్వేర్‌లో కూడా చిన్న రోల్లో కనిపించింది. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కూడా చిన్న రోల్ చేసింది. పెద్ద రోల్స్ చేసే అవకాశాలు రాకపోవడంతో వీటితో సరిపెట్టుకుంటుంది ప్రియాంక. ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అందరు తెలుగు అమ్మాయిల్లాగే ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే ఉండిపోయింది. చిన్న చిన్న గెస్ట్ రోల్స్ తప్పా.. హీరోయిన్‌గా మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ లేడు.

సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సినీ ప్రేక్షకులకు కాస్తంత దూరం అయింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీ ఎప్పుడూ తన అభిమానులకు, కుర్రకారుకు, నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలు ఆరబోస్తూ అదిరిపోయే ఫోటోషూట్లు చేస్తూనే ఉంటుంది.

అలా తాజాగా శారీలో తన వయ్యారాలు ఒలకబోసింది. సంప్రదాయ చీరలో మెస్మరైజ్ చేసింది. తన అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
