Rakul Preet Latest Photos: టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఇక రకుల్ ప్రీత్ చేసే హంగామా మామూలుగా ఉండదు.
ట్రోలర్లకు రకుల్ ప్రీత్ గట్టిగా కౌంటర్లు ఇస్తుంటుంది. రకుల్ ప్రీత్ ఒక్కోసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటుంది. రకుల్ తాజాగా తన ఛత్రివాలి సినిమా జీ5లోకి రాబోతోందంటూ చెబుతూ ప్రమోషనల్ స్టంట్ చేసింది. దీని కోసం సపరేట్‌గా ఫోటో షూట్ చేసింది. అందులో తన ఎద అందాలను బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి.