Rakul Preet: బ్లాక్ డ్రెస్‌లో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్.. అందాల భామ అందచందాలు చూడతరమా!
Rakul Preet: కొన్నాళ్లు టాలీవుడ్‌ను దున్నేసి గట్టిగానే వెనకేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే కొంతకాలంగా అవకాశాలు లేక తెరమరుగైపోయింది. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం పెద్దగా అవకాశాలేమీ లేవు. కానీ ఆఫర్ల కోసం ఈ ముద్దుగుమ్మ గట్టిగానే ప్రయత్నిస్తోంది. తన అందచందాలు ఆరబోసి మరీ అవకాశాల వేట సాగిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. అదే వేదికగా తన గ్లామర్‌ను ప్రదర్శిస్తోంది.
తాజాగా ఆమె ధరించిన బ్లాక్ రంగు మిడీ డ్రెస్ ఆమె అందాన్ని మరింత పెంచేసింది. శరీరానికి హత్తుకునే ఈ డ్రెస్ ఆమె నాజూకు రూపాన్ని హైలైట్ చేసింది. డ్రెస్ డిజైన్, దాని కటింగ్‌లో ఉన్న ప్రత్యేకత రకుల్ స్టైల్‌కు అద్దం పట్టింది. ఈ ఫొటోలలో రకుల్ మేకప్ కూడా చాలా సింపుల్‌గా, సహజంగా ఉండి, ఆమె సహజ సౌందర్యాన్ని వెలికితీసింది. హెయిర్ స్టైల్ కూడా చాలా క్లాసీగా, డ్రెస్సుకు తగినట్లుగా ఉంది.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే వైరల్‌గా మారాయి. అభిమానులు రకుల్ అందాన్ని, ఆమె ఫ్యాషన్ ఎంపికను ప్రశంసిస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. “అద్భుతమైన అందం,” “చాలా బాగున్నారు,” “నలుపు రంగు మీకు చాలా సూట్ అయ్యింది” అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పలువురు ఫ్యాషన్ విశ్లేషకులు కూడా రకుల్ లుక్‌ను మెచ్చుకుంటున్నారు.
2011లో కెరటం అనే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది రకుల్. ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఈ ఫేమ్‌తో అగ్రనటుల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ప్రస్తుతం శంకర్ – కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ 3లో నటిస్తున్నారు. దాంతో పాటు హిందీలో దే దే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా కొండపొలంలో కనిపించిన రకుల్ ఆ తర్వాత టాలీవుడ్‌కు పూర్తిగా దూరమయ్యారు.