Rashi Singh: పసుపు చీరలో రాశీ సింగ్ లేలేత పరువాలు..!
Rashi Singh: ‘శశివదనే’, ‘ఆటగాళ్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాశీ సింగ్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా ఫోటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. పసుపు రంగు పువ్వుల డిజైన్‌తో కూడిన చీరలో మెరిసిపోతున్న రాశీ సింగ్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ లుక్‌లోనూ తన స్టైల్‌ను చాటుకుంటూ, మోడ్రన్ టచ్‌తో కనిపించడం ఆమె ప్రత్యేకత.
ఈ ఫోటోల్లో రాశీ సింగ్ పసుపు రంగు ఫ్లోరల్ శారీలో మెరుపులు మెరిపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆమె ధరించిన బంగారు రంగు చెవిపోగులు, గాజులు ఆమె అందాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా, ఆమె చిరునవ్వు, ఆకట్టుకునే చూపులు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. ఈ ఫోటోషూట్ ద్వారా రాశీ సింగ్ తన ఫ్యాషన్ సెన్స్‌ను మరోసారి నిరూపించుకున్నారు. చీరకట్టులో ఆమె అందం చాలా సహజంగా, ఆకర్షణీయంగా ఉంది. అవి మాత్రమే కాదండోయ్ ఫొటోల కోసం ఆమె పెట్టిన ఫోజులు మరింత కేక పుట్టిస్తున్నాయి. ఎల్లో చీరలా ఎల్లోరా శిల్పంలా కనిపిస్తూ.. కర్రకారును మదిని దోచేస్తున్నాయి.
నటనతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే రాశీ సింగ్, తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె ఫాలోవర్స్ ఈ ఫోటోలపై లైక్‌లు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏమందం మేడమ్ అంటూనే.. మీరు తెలుగులో చాలా సినిమాలు చేయాలని కోరుతున్నారు. అక్కడితో ఆగకుండా నేనే ఓ డైరెక్టర్ అయి మీకు సినిమా ఆఫర్ ఇస్తానంటూ ఓ నెటిజెన్ చెప్పుకొచ్చాడు.
ఈ కొత్త లుక్‌లో రాశీ సింగ్‌ను చూసిన అభిమానులు, ‘చాలా అందంగా ఉన్నారు’, ‘క్లాస్ మరియు క్యూట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా అవకాశాలు కూడా ఈమెకు మరింత పెరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మరికొన్ని కొత్త ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.