Sada Movie Journey : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు స్టార్ట్ అవుతారో చెప్పలేము. రాత్రికి,రాత్రే స్టార్ లు అయినా హీరో, హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అవకాశాలు వస్తే వాటిని అందిపుచ్చుకొని స్టార్డం డమ్ ని సొంతం చేసుకున్న వాళ్లు ఎంతోమంది, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ, స్టార్ లుగా వెలిగిపోతున్నవారు మరి కొంతమంది. ఏదైనా కూడా నటనతో పాటు అదృష్టం మీద ఆధారపడి ఉండడమే కాకుండా,
ఎంచుకునే కథలను బట్టి కూడా వారి జాతకం ఆధారపడి ఉంటుంది. ఆ కోవలోకే వస్తుంది హీరోయిన్ సదా. జయం సినిమాతో విజయాన్ని సొంతం చేసుకొని, సదా చాలా మంచి పేరును సంపాదించుకుంది. జయం సినిమా ఆ రోజుల్లో కుర్రకారులను ఒక ఊపు ఊపేసింది. సదాకు హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చిపెట్టడమే కాకుండా, తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టే అవకాశాన్ని జయం సినిమా ఇచ్చింది.

అయితే జయం సినిమా తర్వాత సదా ఎంచుకున్న సినిమాల వల్ల తను అంతా విజయాన్ని మళ్లీ సొంతం చేసుకోలేకపోయింది. దానికి కారణం తను నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎన్నుకోకపోవడం, తన బాడి లాంగ్వేజ్ కి తగ్గట్టుగా సినిమాలను ఎంచుకోకపోవడం మాత్రమే, లేకపోతే ఈరోజు సదా కూడా సమంత మాదిరిగా చాలా మంచి పొజిషన్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయేది.
ఆ తర్వాత వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టిన సదా, ఒకే ఒక్క వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసి అక్కడ కూడా విజయం సాధించలేకపోయింది. దాని తర్వాత బుల్లితెర పైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అడుగు పెట్టింది. చాలా డ్యాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరించి అక్కడ మంచి సక్సెస్ ని అందుకుంది.
