Shruti Haasan : యూనివర్సల్ స్టార్ కమలహాసన్ కూతురు శృతిహాసన్ ఆయన వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ మొదట్లో ఈ అమ్మడు అనుకున్నంతగా సక్సెస్ ని అందుకోలేకపోయింది. తర్వాత చేసినటువంటి సినిమాలు విజయవంతం కావడంతో ఒక దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా వెళ్ళింది. శృతిహాసన్ మంచి సింగర్ కూడా, తను పాడిన పాటలతో కూడా కుర్రకారులోకి చొచ్చుకు వెళ్ళింది. స్టేజ్ షోలలో డాన్స్ తో కూడా అందరిని ఆకట్టుకుంది.
హింది, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకొక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తర్వాత పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేస్తుంది. ఈ నేపథ్యంలోని సలార్ సినిమా లో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చాన్స్ అనగానే అంత బిగ్గెస్ట్ ఆఫర్ ని శృతిహాసన్ వదులుకోలేకపోయింది.
కానీ ఆ సినిమాలో శృతిహాసన్ పాత్ర నిడివి చాలా తక్కువ, అయినా కూడా తను వెంటనే ఒప్పేసుకుంది. అంత బిగ్గెస్ట్ మూవీ లో యాక్ట్ చేస్తూ మరోవైపు నాని హీరోగా చేసిన ‘హాయ్ నాన్న’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. శృతిహాసన్ కి ఉన్న ఇమేజ్ కి తగ్గట్టుగా పాత్రలు ఎంచుకొని, పారితోషకం కూడా డిమాండ్ చేసే అంత రేంజ్ ఉంది. కానీ శృతిహాసన్ మాత్రం తన దగ్గరికి ఏ పాత్ర వస్తే దాని నిడివెంత, దానికి
సినిమాలో స్కోప్ ఉందా.. లేదా.. అనే విషయాలు ఏమీ పట్టించుకోకుండా వెంటనే ఒప్పేసుకుంటుంది. వచ్చిన సినిమా అల్ల చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ తను కాస్త ఆలోచించి, తన పాత్రను సినిమాలో ముఖ్యంగా ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది అని పలువురు అభిమానులు తెలుపుతున్నారు. శృతిహాసన్ కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది.