Vijay Deverakonda Rashmika Engagement : విజయ్ దేవరకొండ, రష్మిక గీత గోవిందం సినిమా చేసినప్పటి నుంచి వీరి పైన రూమర్స్ అధికమయ్యాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు ఎప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ ఖండిస్తూ వస్తున్నాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ పెళ్లి గురించి ఆలోచన లేదు అని చెప్తూ ఉన్నాడు.
ఈ జంట ఎక్కువగా కలిసి క్లబ్బులకు, పార్టీలకు అకేషన్స్ కి వెళుతూ ఉండడం వల్ల, వీరిద్దరి పైన ఈ రూమర్స్ ఆగడానికి చాన్సే దొరకట్లేదు. తాజాగా వీరిద్దరి గురించి మరొక వార్త బయటకు వచ్చింది. ఫిబ్రవరి నెలలో రెండో వారంలో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ అని నిన్నటి నుండిఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అందరూ కూడా ఈ వార్తను నిజమే అనుకొని ఎవరికి నచ్చినట్టుగా వారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేసి వైరల్ చేశారు.
అయితే తాజాగా ఈ వార్తను ఖండిస్తూ విజయ్ టీం ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజం కాదని ఎవరో కావలసుకొని ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారని స్పష్టం చేసింది. ఇక నిన్నటి నుంచి హల్చల్ చేస్తున్న ఈ న్యూస్ లో నిజం లేదని తెలిసి అందరూ ఉసూరుమంటూన్నారు. ఎప్పటికైనా ఏ జంట పెళ్లి చేసుకుంటుందని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు.