Akshaya Tritiya : అక్షయ తృతీయ అంటేనే బంగారాన్ని కొనుగోలు చేసి లక్ష్మీదేవతని ఇంట్లోకి ఆహ్వానించే రోజు అని అందరూ నమ్ముతుంటారు. ఈరోజు బంగారం కొంటే ఆ సంవత్సరం మొత్తం ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయని ఎంతోమంది నమ్మకం.
ఎంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసాము అని కాకుండా కొద్దిగా బంగారాన్ని అయినా ఈరోజు కొని పూజలో పెడతారు. ఈ సాంప్రదాయాన్ని కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలా ? శాస్త్రాలు ఎం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఏ శాస్త్రాల్లోనూ రాసి లేదని సిద్ధాంతులు చెబుతున్నారు. ఈ వ్యాపారానికి సంబంధించిన విషయమని కేవలం బంగారం షాపు నిర్వాహకులు సృష్టించిన ఒక అబద్ధమని సిద్ధాంతులు వెల్లడిస్తున్నారు. మరోవైపు జనాలు బంగారం షాపుల ముందు క్యూలు కట్టేస్తున్నారు. వారికి తగ్గట్టుగానే షాపు యజమానులు కూడా కొత్త ,కొత్త వెరైటీ డిజైన్లతో బంగారాన్ని కొనుగోలు చేశారు.
వాస్తవానికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే.. అక్షయ తృతీయ అనేది చాలా శుభసూచకమైన రోజు, అంతేకానీ స్వర్ణాన్ని కొనుగోలు చేయడం దాని అర్థం కాదు. చాలావరకు అక్షయ తృతీయనాడు దానధర్మాలు చేయడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో ధనవంతులు బంగారాన్ని అక్షయ తృతీయ నాడు దానం చేసేవారు.
రాను,రాను ఈ ఆచారం మరుగున పడిపోయి, బంగారం కొని దాచుకునే రోజులు వచ్చేసాయి .. అక్షయ తృతీయ నాడు ఆ అక్షయ కరుణ మన పైన ఉండాలి అని అంటే లక్ష్మీదేవి పూజ నిర్వహించాలి. ఆ లక్ష్మీదేవి పేరు దానధర్మాలు చేయాలి. కానీ ఇలాంటి ఆచారం మధ్యలో సృష్టించబడిందని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.