Astrology : ప్రతి మనిషి గుణం వారి యొక్క రాసి పై ఆధారపడి ఉంటుంది. కొంతమంది అతిగా ఆలోచించడం, అతిగా ఆందోళన చెందడం, తీర్థమైన మానసిక ఒత్తిడికి గురవడం దానివల్ల ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. అయితే ఏ రాశి వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్య : కన్యరాశి వారు పరిపూర్ణంగా ఉండడమే కాకుండా కొన్ని పరిస్థితులలో అతిగా ఆలోచించే విధానాన్ని కూడా కలిగి ఉంటారు. వారు ఎప్పుడూ ఆందోళన చెందుతూ నిత్యం ఇతరులను విశ్లేషించుకుంటూ, విమర్శించడానికె ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ ఆలోచన విధానాన్ని వారు మార్చుకోవడం కష్టం.
మిధునరాశి : మిధునరాశి వారు చాలా విభిన్నమైన దృక్పథం కలిగి ఉంటారు. వారి ఆలోచన విధానం కూడా చాలా విభిన్నంగానే ఉంటుంది. వీరు సాధారణంగా ప్రతి విషయాన్ని విశ్లేషించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే సమయంలో ఒత్తిడికి గురవుతారు.
వృశ్చికరాశి : వృశ్చికరాశి వారు కూడా ప్రతి చిన్న విషయానికి ఒత్తిడిగా ఫీల్ అవుతూ, తమ ఆలోచన విధానం పైన నియంత్రణ కోల్పోతారు. వీరు ఎక్కువగా ఆలోచిస్తారు.
మీనరాశి : మీనరాశి వారు సున్నితత్వం కలిగి ఉంటారు. వారి సున్నిత స్వభావం కారణంగా వారు తరచుగా ఆలోచిస్తారు. తమ గురించి మాత్రమే కాదు, ఇతరుల గురించి కూడా వీరు ఆలోచిస్తూనే ఉంటారు. వీరి ఒత్తిడికి కూడా పరిష్కారం కనిపెట్టడం కష్ట సాధ్యమైంది.
తులారాశి : తులారాశి వారు గొడవలను ఇష్టపడరు. వీరికి ప్రశాంతంగా జీవించాలని అభిప్రాయం ఉంటుంది. కానీ కొన్నిసార్లు వీరు అతిగా ఆలోచించడం, తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని లేక లాభాన్ని కలిగిస్తాయా.. అనే అంచనాలు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవడం వీరి లక్షణం.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్ పర్సన్స్. వీరు తమ భావన గురించి చాలా లోతుగా ఆలోచించడమే కాక ఎవరితో మాట్లాడిన ఆ విషయం పట్ల అతిగా విశ్లేషిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించి, ఆందోళనకు గురవుతారు.