Beeruva Direction in Home : బీరువాను ఏ వైపు ఉంచుకోవాలి అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. అసలు ఈ విషయంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇపుడు తెలుసుకుందాం..
డబ్బు, విలువైన వస్తువులు నైరుతి గదిలో ఉంచితే ఆదాయాభివృద్ధి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. బీరువాను నైరుతి గదిలో ఉత్తర ముఖంగా ఉంచాలి. డబ్బు తీసేవారు దక్షిణ ముఖముగా తీసే విధముగా ఉండాలి. ఇది మొదటి ప్రాధాన్యత. ఒకవేళ అది కుదరని ఎడల నైరుతి గదిలో తూర్పు ముఖముగా ఉంచాలి. డబ్బు తీసేవారు పడమర ముఖంగా తీసే విధముగా ఉండాలి. ఇది రెండవ ప్రాధాన్యత.
Also Read: చెత్త డబ్బా ఎక్కడ పెట్టాలి.. పొరపాటున కూడా ఇంట్లో ఈ దిక్కున పెట్టకండి..!
చాలా మంది కుబేర స్థానం ఉత్తరం వైపు కాబట్టి.. ఉత్తరపు గోడకు బీరువా ఆనించి పెడతారు. అది సరైన పద్ధతి కాదు. కొంతమంది బీరువాలను ఈశాన్యంలో ఉంచుతారు. ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. బరువైన వస్తువులు, నేలను తాకే వస్తువులు ఈశాన్యంలో ఉంచరాదు. దీనివల్ల ఆర్థిక నష్టం, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా జరగవచ్చు. అలాగే ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో డబ్బును ఉంచరాదు. వాయువ్యం లో ఉంచిన ఎడల ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇంట్లో డబ్బు నిలువదు. కనుక అన్ని విధాలా నైరుతి గదిలో బీరువాని పెట్టడం శ్రేయస్కరం. ఒకవేళ అక్కడ వీలు కానట్లయితే నైరుతి పక్క గదుల్లో అయినటు వంటి దక్షిణం, పశ్చిమం గదుల్లో ఉండడం మంచిది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.