Benefits of Wearing Gold: బంగారం ఎల్లప్పుడూ మనుషులను ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరూ బంగారం కొనుుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. బంగారం కలిగి ఉండటం అనేది ఒకరి సంపదకు చిహ్నంగా గుర్తిస్తారు. అలాగే జ్యోతిష్యంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.
బంగారాన్ని ధరించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు..
* వివిధ కులాలు, సంస్కృతులకు చెందిన చాలా మంది ప్రజలు ఆనందం, అదృష్టం, ప్రేమ, ఆధ్యాత్మిక శాంతి కోసం ప్రతిరోజూ బంగారం, ఇతర రత్నాలను ధరిస్తారు.
* మీ ఉంగరపు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం ద్వారా, మీరు దైవిక చైతన్యాన్ని ఆకర్షించగలరని నమ్ముతారు. జీవితంలో అడ్డంకులు తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.
* బంగారం ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలియజేయడానికి, మహిళలు తమ ఎడమ చేతికి బంగారు ఉంగరాన్ని ధరించాలి. పురుషులు వారి కుడి చేతికి ధరించాలి.
* భూమిపై లభించే అత్యంత ముఖ్యమైన లోహం బంగారం. ఇది శ్రేయస్సు మరియు రాయల్టీని సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో బంగారం ప్రతి గ్రహంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, ఇది ప్రధానంగా బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. బంగారం, సరిగ్గా ధరిస్తే, అదృష్టం, శ్రేయస్సును ఆకర్షించవచ్చు.
బంగారం ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు..
బంగారం బలం, వేడిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే బంగారాన్ని ధరించడానికి చాలామంది సూచించే వివిధ నియమాలను ఒకసారి చూద్దాం.
* జలుబు, దగ్గు సమస్య ఉంటే చిటికెన వేలుకు బంగారాన్ని ధరించాలి.
* మీరు పేరు, కీర్తి లేదా హోదాకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు మీ మధ్య వేలికి బంగారాన్ని ధరించాలి.
* మీకు ఏకాగ్రత లోపిస్తే, మీరు మీ చూపుడు వేలుకు బంగారాన్ని ధరించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
* వివాహంలో సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీకు, మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం లోపించిందా? అయితే, బంగారు గొలుసు లేదా లాకెట్టు ధరించండి. ఇది మీ కోసం అద్భుతాలు చేస్తుంది.
* గర్భం దాల్చడంలో సమస్యలు ఉన్నవారు ఉంగరపు వేలికి బంగారాన్ని ధరించాలి.
* ఇనుము, బొగ్గు వ్యాపారులు బంగారానికి దూరంగా ఉండాలి. గర్భిణులు, వృద్ధులు బంగారం ధరించడం మానుకోవాలి.
* నడుము కింది భాగంలో బంగారాన్ని ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది దురదృష్టాన్ని ఆకర్షిస్తుంది. బంగారాన్ని లక్ష్మీ దేవి చిహ్నంగా భావిస్తారు, కాబట్టి దానిని నడుము క్రింద ధరించడం ఆమెను అగౌరవపరుస్తుంది అని నమ్ముతారు.
* బంగారు పాదరక్షలు ధరించడం మానుకోండి.
బంగారాన్ని ధరించి మాంసాహారం, మద్యం సేవించడం దురదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
* తూర్పు లేదా నైరుతి వైపు లాకర్‌లో ఎరుపు రంగు కాగితం లేదా గుడ్డపై బంగారాన్ని ఉంచాలి.
* ఇనుమును బంగారంతో కలపవద్దు.
బంగారాన్ని తల దగ్గర పెట్టుకోవద్దు. మీరు నిద్రలేమిని ఎదుర్కోవచ్చు.