Bhadrachalam Temple Online Tickets: నేటి నుండే ఆన్ లైన్ లో భద్రాద్రి రామయ్య కళ్యానోత్సవ టికెట్లు…ఉత్సవాలకి రాని భక్తులకి కీలక సూచన చేసిన ఈవో
ఈ నెల 30న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ ఈవో రమాదేవి మాట్లాడుతూ “ఈ నెల 30 న జరిగే కళ్యాణ మహోత్సవ వేడుకతో పాటు 31న నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాళ్లని వీక్షించే భక్తుల కోసం టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచినట్టు” తెలిపారు.
అయితే గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా కూడా టికెట్లు విక్రయించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకి నేరుగా హాజరయ్యే అవకాశం లేని భక్తులకి పరోక్షంగా గోత్ర నామాలతో కళ్యాణం జరిపించుకునేందుకు రూ.5000 లు, రూ.1,116 ల టికెట్లను వెబ్ సైట్ ద్వారా తమ కార్యాలయం లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.రూ.5 వేల రుసుముకు శ్రీ స్వామి వారి మూలవరుల శాలువా, జాకెట్ ముక్క, కుంకుమ, తలంబ్రాలు, మిస్రి ప్రసాదం పోస్టల్ లేదా కొరియర్ ద్వారా పంపిస్తామని అలాగే,రూ.1,116 ల టికెట్ తీసుకున్నవారికి స్వామి వారి కల్యాణ కండువా, జాకెట్ ముక్క, కుంకుమ, తలంబ్రాలు, మిస్రి ప్రసాదం పంపుతామని తెలిపారు. టికెట్స్ కోసం భక్తులు WWW.badhrachalamonline.com అనే వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు.