మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు. అయితే, ఇక ఇంటిలో లేదా ఆఫీసులు ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై కూడా వాస్తుశాస్త్రం వివరంగా చెబుతుంది. అయితే కొత్త క్యాలెండర్ ని ఏ దిక్కులో ఉంచితే మంచిదనేది వాస్తు పండితులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం కొత్త క్యాలెండర్ ని ఇంట్లో పెట్టేటప్పుడు ఉత్తరం, తూర్పు, పడమర వైపు ఉంచడం వలన చాలా మంచి కలుగుతుంది. కొత్త క్యాలెండర్ ని ఇంట్లో పెట్టాలంటే ఉత్తరం, తూర్పు, పడమర వైపునే ఉంచండి. ఇది పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తుంది. నెగటివ్ ఎనర్జీ ని ఇది దూరం చేస్తుంది. ఎప్పుడూ కూడా క్యాలెండర్ ని దక్షిణం వైపు ఉంచకూడదు. దక్షిణం వైపు ఉంచడం వలన సమస్యలు వస్తాయి.
క్యాలెండర్ లో ఉదయిస్తున్న సూర్యుడు, ధనం వంటి ఫోటోలు ఉండొచ్చు. కానీ క్రూర జంతువులు, బాధాకరమైనవి ఉండకూడదు. క్యాలెండర్ లో ఎప్పుడు కూడా ఆకుపచ్చ, నీలం, తెలుపు, పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటే మంచిది. ఈ రంగులు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ఉత్తరం వైపు క్యాలెండర్ ని ఉంచడం వలన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. గ్రీనరీ, ఫౌంటెన్, పెళ్లి ఫోటోలు వంటివి ఉంచుకోవచ్చు ఇలా ఈ విధంగా పండితులు అనుసరిస్తే ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు.