Chanakya Neeti : చాణక్యుడు తన నీతి సూత్రాలతో సామాజిక సంక్షేమానికి సంబంధించిన చాలా విషయాలను ప్రస్తావించాడు. ఒక వ్యక్తి వాటిని అనుసరించడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఖచ్చితంగా వాటిని అనుసరించి, అమలు చేస్తే ఆ వ్యక్తులు కోటీశ్వరులుగా అవుతారు. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎవరు దొంగలించలేనిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని విద్య నుండి పొంది, ఎంత నేర్చుకుంటే అంత సమాజంలో గుర్తింపు పొందవచ్చు.
ఆ జ్ఞానాన్ని గురువు నుండి పొంది జీవితంలో మంచి విద్యార్థిగా నిలబడిన వ్యక్తి ధనవంతుడు అవుతాడని చాణక్యుడు చెప్పాడు. ఏదైనా పనిని మొదలుపెట్టేముందు దానికి ఒక ప్రణాళిక ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ పనిలో విజయం సాధించవచ్చు అని చాణక్యుడు చెప్పాడు. అలా విజయం సాధించిన పని పూర్తి చేస్తే అవకాశాలు కూడా పెరుగుతాయి.

దానివల్ల డబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు సమాజంలో మంచి గుర్తింపు, హోదా లభిస్తాయి. భోజనం చేసేటప్పుడు సిగ్గుపడకూడదని చాణక్యుడు వివరించాడు. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి ఆకలితో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. ఆకలితో ఉంటే ఆలోచన రాదు. ఆకలితో ఉంటే విచక్షణ కోల్పోతారు.
కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్న ఆకలిని మాత్రం తీర్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను అనుసరిస్తే ఖచ్చితంగా మంచి జీవితం లభిస్తుంది.
