Holi History and importance : హోలీ అంటేనే రంగులు పండుగ. ఉదయం లేవగానే అందరూ సంతోషంగా ఎంతో కోలాహలంతో జరుపుకునే పండుగ హోలీ. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు అద్దుకుంటూ ఈ పండుగలో పాల్గొంటారు. హోలీ పండుగ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వైష్ణవములో రాక్షసరాజు హిరణ్యకశపుడు.. హిరణ్యకశిపుడు శివుని భక్తుడు.
కానీ తన కొడుకు ప్రహ్లాదుడు మాత్రం శివుని పూజించకుండా విష్ణుమూర్తిని పూజించేవాడు. అది నచ్చని హిరణ్యకశుపుడు ప్రహ్లాదుడు మనసు మార్చడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎంతకీ కూడా ప్రహ్లాదుడు విష్ణుమూర్తి పట్ల ఉన్న తన భక్తిని మార్చుకోడు. ప్రహ్లాదుని ఎలాగైనా శివుని భక్తిగా మార్చాలని తనకు ఎన్నో శిక్షలు విధిస్తాడు. అయినా కూడా ప్రహ్లాదుడిలో ఎటువంటి మార్పు రాదు.
అది హిరణ్యకశపుడికి నచ్చకపోవడంతో భక్త ప్రహ్లాదుడిని చంపాలని అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలిచి.. ఆమెకు ఉన్నశక్తితో భక్త ప్రహ్లాదుడిని మంటలతో ఆహుతి చేయమని కోరతాడు. దీంతో ఆమె భక్త ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో భక్త ప్రహ్లాదుడు బయటపడతాడు.. హోలిక రాక్షసి మాత్రం మంటల్లో చిక్కుకొని చనిపోతుంది.
ఇక ఆమె దహనమైన రోజునే హోలీ పండుగగా పిలుస్తారని ప్రచారంలో ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో హోలిక దహనం చేస్తుంటారు. ఆ రోజున పురస్కరించుకొని అందరూ రంగులు జల్లుకుంటూ చెడు పైన మంచి విజయం అని ఆనంద ఉత్సాహాలతో ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. కానీ రాను, రాను స్వచ్ఛమైన రంగుల స్థానంలో రసాయనాల రంగులు వచ్చేసి చాలా నష్టాన్ని తెస్తున్నాయి. ఈ రంగుల పండుగను ప్రకృతి పరమైన రంగులతో అందరం సంతోషంగా జరుపుకుందాం.