• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం ఎన్ని ముఖాలు ఉంటాయి?

TrendAndhra by TrendAndhra
December 22, 2022
in ఆధ్యాత్మికం
0 0
0
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం ఎన్ని ముఖాలు ఉంటాయి?
Spread the love

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.

పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. మనకు ప్రతీ శివాలయాల్లోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.

శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖాన్ని “వామదేవ” ముఖం అని అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం. ఇక చివరి ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని “ఈశాన ముఖం” అంటారు. మనం లిగంపైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసి “వాసుదేవ ముఖం” నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్తమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు, శివుడు ఒకరే … రెండు లేనే లేవు …. శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి. శివపురాణంని రాసినది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు … విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే … రెండు కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.

అంతేకాక ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నాహం అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది. అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందొ అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండు … మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తారు. ఉదాహరణకు … ఉన్న కోటిని ధర్మబద్ధంగా రెండు కోట్లు చేస్తారు. (ఇది ఉదాహరణ మాత్రమే మీకు ఈజీగా అర్థమవ్వాలని) మూడు … మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు … ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్థితిలో (షుగర్ ఉందనుకోండి) ఉంటే, అప్పుడు ఉన్న దాన్ని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండా కాపాడతాడు.

తురువాత ఈశాన ముఖము. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్వ్యంని నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిపట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లు పదఘట్టన వినకూడదు జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని, బిల్వపత్రాలని కాని, కుంకుమను కాని, ప్రసాదాన్ని కాని ఎట్టి పరిస్థితులలో నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నందిమీద విభూధిని, బిల్వఆకులను వేస్తూ ఉంటారు. అది మహాపాపంగా పరిగణించబడింది. అందరూ రోజు శివమహిమ్నాస్తోత్రం చదవండి. శివస్తోత్రాలు అన్నింటిలోకి చాలా ప్రాముఖ్యమైనది “శివమహిమ్నాస్తోత్రం”


Spread the love
Tags: Ashta Mukha LingamChaturmukhalingaDevotional Latest News in TeluguDevotional NewsDevotional News in TeluguDevotional News TeluguEmblem of God Shiva with Four FacesHow many faces have loard ShivaLatest Bhakthi NewsLatest News on GodLatest News on Lord KrishnaLatest News on Lord ShivaLatest News on Lord VishnuLatest Telugu Spirituality NewsMukhalingaPanchanana ShivaShiva LingaTelugu Devotional NewsToday Devotional News in TeluguTrend AndhraTrend Andhra Devotional NewsTrend Andhra NewsTrendandhra Latest Devotional NewsWhat is the five faces of god shiva?ఆధ్యాత్మికంభక్తి
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.