Interesting Facts : మహాశివుడి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ.. భూలోకంలో అవతరించిన గొప్ప దైవం. శివుడి లీలలు మానవమాత్రుడికి వర్ణింపతరం కాదు. దేశ విదేశాల్లో శివుడు లింగాకారంలో వెలిసి భక్తుల పూజలను అందుకుంటున్నాడు.
పరమ శివుడు అనేక రూపాల్లో వెలిసినాడు.
శివుడు వెలిసిన ఆలయాల్లో ఒక్కొక్కటి ఒక్కో విశిష్టత కలిగి ఏదో ఒక రహస్యాన్ని ఆలయంలో దాచుకొని భక్తుల కోరికలను తీరుస్తూ నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు. పరమశివుడు అలా రహస్యాలు దాచుకున్న ఆలయాల్లోని ఒక ఆలయమే మన ఈ కేదారేశ్వర స్వామి ఆలయం.
ఈ కేదారేశ్వర ఆలయం అపురూపమైంది. చూపరులను ఆకట్టుకునే అద్భుతమైన కట్టడం. ఈ ఆలయం అహమద్ నగర్ లో హరిచంద్ర కోట లో ఉంది. ఈ మందిరం ఒక పెద్ద బండరాయి పై ఉంది. కింద 4 స్థంబాలు ఉంటాయి. ఆ నాలుగు స్తంభాల పైన శివుడి గుడిని నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఇప్పటి వరకూ కనిపెట్టలేకపోయారు.
ఒక్కో యుగానికి ఒక్కో స్తంభం అన్నట్టు.
అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాలకి గుర్తులుగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని ఈ స్తంభాల దగ్గరే దేవుడి మహిమ దాగి ఉంది. ఆ స్తంభాలలోనే విశేషాలు, వింతలు దాగి ఉన్నాయి. ఈ నాలుగు స్తంభాలలో ఒక్కో యుగాంతానికి ఒక్కో స్థంభం విరిగిపోతుంది.
ఇప్పటికే అక్కడ ఉన్న మూడు స్తంభాలు విరిగిపోయాయి, ఇప్పుడు మనం కలియుగంలో వున్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంభం పైన మాత్రమే వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్థంభం కూడా పతనం అవుతుందో, ఆ రోజు ఈ కలియుగానికి ఆఖరి రోజుగా పండితులు చెప్తున్నారు.